నాగార్జునకు చిన్న కొడుకు సర్‌ప్రైజ్‌.. అదేంటో చూసేయండి! | Akhil Akkineni Lenin Teaser Released to Surprise Nagarjuna Akkineni | Sakshi
Sakshi News home page

నాగార్జునకు అఖిల్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిందిగా!

May 23 2026 12:23 PM | Updated on May 23 2026 12:34 PM

Akhil Akkineni Lenin Teaser Released to Surprise Nagarjuna Akkineni

మొదటి అడుగు ఎవరికైనా ప్రత్యేకమే.. కింగ్‌ నాగార్జున నటించిన మొదటి సినిమా విక్రమ్‌. ఈ మూవీ విడుదలై నేటి (మే 23)కి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తండ్రికి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు చిన్న కుమారుడు, హీరో అఖిల్‌. అఖిల్‌ కథానాయకుడిగా నటించిన 'లెనిన్‌' మూవీ టీజర్‌ వదిలారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు.

తండ్రికి సర్‌ప్రైజ్‌
'నా సినీ జీవితం మొదలైన రోజు అఖిల్‌ నాకో చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరూ చూడండి, మనోడు వస్తున్నాడు' అని రాసుకొచ్చాడు. లెనిన్‌ టీజర్‌ విషయానికి వస్తే.. 'ఏమంటివి ఏమంటివి...' అన్న ఎన్టీఆర్‌ డైలాగ్‌తో వీడియో మొదలైంది. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే రంగస్థల కళాకారిణిగా ఆ డైలాగ్‌ను స్టేజీపై చెప్తుంది. 

పల్లె పరిమళం
ఎన్టీఆర్‌ అంత కాకపోయినా బానే చెప్పావని మెచ్చుకున్నాడు హీరో అఖిల్‌. ఇద్దరూ పల్లెటూరి యాసలో డైలాగులు చెప్తూ మెప్పించారు. టీజర్‌ అయితే అదిరిపోయింది. ఈసారి అఖిల్‌ చాలా కొత్తగా ట్రై చేశాడని, హిట్టు గ్యారెంటీ అని అభిమానులు అప్పుడే ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 26న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. తమన్‌ సంగీతం అందించాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement