సాధారణంగా సినిమాలు హిట్ అయితే హీరోయిన్లకు క్రేజ్ వస్తుంది. కొన్నిసార్లు ఫలితంతో సంబంధం లేకుండా ఫ్లాప్స్ అందుకున్నా సరే కొందరు బ్యూటీస్ బాగానే గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ల ఈమె ఒకరు. మరో రెండు నెలల్లో ఈ భామ హీరోయిన్‌గా చేసిన మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
పైన మీసకట్టుతో తలపై కిరీటంతో కనిపిస్తున్న ఈ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ముంబైకి చెందిన ఈమె.. రవితేజ 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీనే ఘోరమైన డిజాస్టర్. అయినా సరే 'కింగ్డమ్', 'కాంత' లాంటి పాన్ ఇండియా మూవీస్‌లో అవకాశాలు అందుకుంది. కానీ ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. గతేడాది చివరలో వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలుకా' కూడా ఫ్లాప్ అయింది.
ప్రస్తుతం భాగ్యశ్రీ చేస్తున్న తెలుగు సినిమా 'లెనిన్' మాత్రమే. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చితం.. జూన్ 26న థియేటర్లలోక రానుంది. ఇది హిట్ కావడం అఖిల్‌కి ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి కూడా అంతే కీలకం. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే తెలుగులో మరికొన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే పరిస్థితి కష్టమైపోవచ్చు. ఇకపోతే శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'సెయాన్' మూవీతో భాగ్యశ్రీ, తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.
(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?)



