మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం? | Mrunal Thakur Likely Acts Yellamma Movie | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ఆ క్రేజీ సినిమాలో మృణాల్.. ఈసారైనా నమ్మొచ్చా?

May 6 2026 11:23 AM | Updated on May 6 2026 11:35 AM

Mrunal Thakur Likely Acts Yellamma Movie

కొన్ని సినిమాలు అనుకున్న వెంటనే ప్రారంభం కావు. ఎందుకో ఎవరికీ అర్థం కాదు. తెలుగులో అలాంటి ఓ మూవీ ఉంది. నాని, నితిన్, శర్వానంద్ ఇలా పలువురు హీరోలు నటిస్తారని టాక్ వచ్చిన ఆ మూవీలో సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు లీడ్ రోల్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఊహించని విధంగా మృణాల్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ప్రాజెక్ట్ ఎక్కడివరకు వచ్చింది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

స్వతహాగా కమెడియన్ అయినప్పటికీ 'బలగం' మూవీతో దర్శకుడిగా మారిన వేణు బంపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత 'యల్లమ్మ' పేరుతో ఓ మూవీ చేయాలి. రెండు మూడేళ్ల నుంచి దీని గురించి వినిపిస్తూనే ఉంది. కానీ ఎంతకీ ముందుకు కదలట్లేదు. అసలు ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందా లేదా అని చెప్పలేని పరిస్థితి.

తొలుత ఈ సినిమాలో హీరోగా నాని చేస్తాడని రూమర్స్ వచ్చాయి. కానీ అతడు నో చెప్పడంతో నితిన్ లైన్‌లోకి వచ్చాడు. గతేడాది తన 'తమ్ముడు' మూవీ రిలీజ్ టైంలో జరిగిన ప్రమోషన్లలో నితిన్ దీని గురించి చెప్పాడు. కానీ 'తమ్ముడు' ఘోరమైన డిజాస్టర్ కావడంతో నితిన్‌ని సైడ్ చేశారు. తర్వాత శర్వానంద్ పేరు వినిపించింది. కట్ చేస్తే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ప్రకటించారు. ఓ వీడియోని కూడా రిలీజ్ చేసి షాకిచ్చారు.

హీరో సెట్ అయ్యాడు గానీ హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలుత సాయిపల్లవి అన్నారు. ఆమె సెట్ అవ్వలేదు. తర్వాత కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఈమె కూడా లేదని అన్నారు. తర్వాత ఒకరిద్దరూ ట్రెండింగ్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ పనవ్వలేదు. ఇప్పుడు మృణాల్ ఠాకుర్.. 'యల్లమ్మ'లో హీరోయిన్ అని అంటున్నారు. మరి ఈసారైనా రూమర్స్ నిజం చేస్తారా లేదా అనేది చూడాలి?

మృణాల్ తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. సీతారామం, హాయ్ నాన్న తోపాటు గత నెలలో రిలీజైన 'డెకాయిట్'లోనూ మృణాల్ అదరగొట్టేసింది. ఒకవేళ ఈమె గనుక 'యల్లమ్మ'లో నటిస్తే ఎలా ఉంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై అట్రాసిటీ కేసు)

Advertisement
 
Advertisement
Advertisement