స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై అట్రాసిటీ కేసు | FIR On Smriti Mandhana Former Fiance Palash Muchhal | Sakshi
Sakshi News home page

Palash Muchhal: చిక్కుల్లో సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్

May 6 2026 10:43 AM | Updated on May 6 2026 11:04 AM

FIR On Smriti Mandhana Former Fiance Palash Muchhal

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. స్మృతి ఫ్రెండ్ విజ్ఞాన్ ప్రకాశ్ ఫిర్యాదుతో సంగ్లీ పోలీసులు.. పలాష్‌పై ఎస్సీ-ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం కాస్త సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ)

ఏం జరిగింది?
పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. ఓ సినిమా కోసం పలాష్, తన దగ్గర రూ.25 లక్షలు తీసుకున్నాడని విజ్ఞాన్ ఫిర్యాదు చేశాడు. ఆరు నెలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పి తనని మోసం చేశారని విజ్ఞాన్ ఆరోపించాడు. గతేడాది నవంబరులో మహరాష్ట్రలోని సంగ్లీ-అష్టా రహదారిపై ఉన్న టోల్ ప్లాజ్ దగ్గర డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడే పలాష్.. తన కులాన్ని ఉద్దేశించి తిట్టాడని, బూతులతో అవమానించాడని విజ్ఞాన్ పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

గతేడాది నవంబరులోనే క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్ పెళ్లి జరగాలి. కానీ అనుహ్యంగా రద్దయింది. పలాష్‌కి మరో అమ్మాయితో సంబంధం ఉండటం వల్ల ఇది రద్దయిందని రకరకాల రూమర్స్ వినిపించాయి. దీని గురించి అంతా మర్చిపోయారు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పలాష్‌పై స్మృతి స్నేహితుడు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement