కుమారస్వామి ఆవహిస్తే? కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ.. 'అమరన్'తో పాటు తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. గతేడాది 'మదరాశి' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'పరాశక్తి' అనే పీరియాడికల్ చిత్రం చేశాడు. తమిళంలో మాత్రమే ఇది థియేటర్లలో రిలీజైంది. తెలుగు కూడా చేద్దామనుకున్నారు గానీ ఎందుకనో వెనకడుగు వేశారు. నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇకపోతే ప్రస్తుతం 'సెయాన్' అనే సినిమా చేస్తున్నాడు. దీనికి కమల్‌హాసన్ నిర్మాత. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)దాదాపు మూడున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియో బట్టి చూస్తే.. 'సెయాన్' చిత్రం రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. అయితే ఇందులో శివకార్తికేయన్.. పూర్తిగా రస్టిక్ లుక్‌లో కనిపించనున్నాడు. కుమారస్వామి ఇతడికి ఆవహించడం లాంటి ఎలిమెంట్ కూడా చూపించారు. 'సెయాన్' అంటేనే కుమారస్వామికి మరోపేరు. టైటిలే ఇది పెట్టారంటే కచ్చితంగా ఇందులో కుమారస్వామి గురించి కాస్తో కూస్తో చూపించడం గ్యారంటీ. కాకపోతే మూడున్నర నిమిషాల వీడియోలో చాలావరకు తమిళ ఫ్లేవర్ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకుడు. ఇదే ఇతడికి మొదటి సినిమా.ఇకపోతే త్రివిక్రమ్ కూడా కుమారస్వామికి చెందిన 'గాడ్ ఆఫ్ వార్' కథతో ఓ సినిమా తీయాలని అనుకున్నారు. తొలుత అల్లు అర్జున్ హీరో అనుకున్నారు గానీ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో దీన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)