సమంతకు కంగ్రాట్స్.. ట్రైలర్‌ చూసి ఫిక్సయ్యా: అఖిల్ | Akhil Akkineni Congratulations to Samantha for Maa Inti Bangaram hit | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: 'సమంతకు కంగ్రాట్స్.. మా ఇంటి బంగారం చూడలేదు'

Jul 3 2026 4:33 PM | Updated on Jul 3 2026 4:42 PM

Akhil Akkineni Congratulations to Samantha for Maa Inti Bangaram hit

నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని లేటేస్ట్ మూవీ లెనిన్‌ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ స్టోరీగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అఖిల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడారు. ఈ మూవీ హిట్‌ కావడంపై సమంతకు విషెస్ తెలిపారు. సినిమా చాలా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిందన్నారు.

అఖిల్ మాట్లాడుతూ..' నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ ట్రైలర్ చూడగానే చాలా నచ్చింది. ట్రైలర్ చూశాక కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. ఓ మంచి కుటుంబం ఉండే ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే పాయింట్ బాగా నచ్చింది. సమంత పవర్‌ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళ ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ అంటూ సమంతతో పాటు చిత్రబృందానికి అభినందనలు' తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement