అక్కినేని నాగార్జున తనయుడు తనయుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కుదరకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.
No WAR is more VIOLENT than LOVE ❤️🔥#SoulOfLenin is out now
▶️ https://t.co/caQUyeFpz1
MANODU VASTHUNNADU 🔥🔥#Lenin #LeninOnJune26th @MusicThaman Musical 🎶
🎤 @ImVagdevi
✍️ #KalyanChakravarthy@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/Cnm7pLzX5U— Sithara Entertainments (@SitharaEnts) June 5, 2026


