అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్‌కు నాగార్జున అక్కినేని వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అంశాలు కూడా ఈ కథలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం' అని సునీల్ చెప్పే డైలాగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లోని ఫైట్స్ చూస్తుంటే రాయలసీమ ఫ్యాక్షన్‌ను తలపిస్తోంది. 'కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని.. ఏంది అట్టనే సేద్దామా' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు.


