'అందుకు నన్ను క్షమించండి.. ఈ సారి నేను మాట్లాడను' | Akkineni Akhil Comments At Lenin Movie Trailer Launch Event, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Akkineni Akhil: 'ఈ సారి నమ్మండి.. నేను మాట్లాడను'

Jun 30 2026 9:10 PM | Updated on Jul 1 2026 10:49 AM

Akkineni Akhil Comments at Lenin Movie Trailer launch event

టాలీవుడ్ అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్ లెనిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైజాగ్ వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అఖిల్‌ ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

నా సినిమా వచ్చి ఇప్పటికీ మూడేళ్లయిందని.. సారీ బ్రదర్.. ఈ విషయంలో నన్ను క్షమించాలంటూ అభిమానులను కోరారు అఖిల్. నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సారి నేను మాట్లాడను.. కేవలం నా సినిమానే మాట్లాడుతుందన్నారు. ఇంతకుమించి నేనేం చెప్పకూడదు.. రెండు రోజులుగా నేను నిద్రపోలేదు.. కళ్లద్దాలు పెట్టుకుని వద్దామనుకున్నానని తెలిపారు. మిమల్ని చూస్తుంటే జూలై 10 వరకు పనిచేసే ఎనర్జీ వచ్చిందని అభిమానులను ఉద్దేశించి అఖిల్ మాట్లాడారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement