అఖిల్ లెనిన్ వాయిదా.. కొత్త తేదీ ఇదే | Know Reason Behind Why Akhil Akkineni Lenin Movie Postponed Again, Check Out New Release Date Details | Sakshi
Sakshi News home page

Lenin Movie: అఖిల్ లెనిన్ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

Jun 13 2026 7:01 PM | Updated on Jun 13 2026 8:01 PM

Akhil Akkineni lenin Movie post poned again new date announced

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. ఈ మూవీని మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓ సారి వాయిదా పడింది.  మే 1న రిలీజ్‌ కావాల్సి ఉండగా.. జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.

తాజాగా మరోసారి అఖిల్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. లెనిన్ టీమ్ అభ్యర్థనతో నా దగ్గరికి వచ్చారని.. ప్రేక్షకుడికి వందశాతం అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు మరింత సమయం కావాలని అడిగారని ట్వీట్ చేశారు. వారి అభిరుచి, స్ఫూర్తిని చూసి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చారు. లెనిన్ జూలై 10న విడుదల కానుందని.. మీరు ఒక కొత్త అఖిల్‌ను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు నాగార్జున సూచించారు.  

కాగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా..  కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్‌ చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement