అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా? | Akhil Akkineni Lenin postponed again for Ram Charan Peddi Movie | Sakshi
Sakshi News home page

Lenin Movie: అఖిల్ లెనిన్ వాయిదా.. అందుకేనా?

Jun 15 2026 5:18 PM | Updated on Jun 15 2026 5:53 PM

Akhil Akkineni Lenin postponed again for Ram Charan Peddi Movie

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘లెనిన్‌’. ఈ మూవీని మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.

అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్‌ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement