పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. బాక్సాఫీస్ వద్ద దురంధర్ చెత్త రికార్డ్..! | Ranveer Singh Dhurandhar franchise has Falied at Japan Box Office | Sakshi
Sakshi News home page

Dhurandhar Movie: పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. బాక్సాఫీస్ వద్ద దురంధర్ చెత్త రికార్డ్..!

Jul 13 2026 9:27 PM | Updated on Jul 13 2026 9:45 PM

Ranveer Singh Dhurandhar franchise has Falied at Japan Box Office

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన రణవీర్ సింగ్  స్పై యాక్షన్‌ మూవీ దురంధర్. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్‌ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు చిత్రాలు కలిపి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఏకంగా రూ.3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్పై మూవీస్‌కు ఆడయన్స్‌ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే జపాన్‌లో ఇండియన్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్‌లో గతంలో రిలీజైన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. జపాన్‌లో ఇండియన్ చిత్రాల క్రేజ్ దృష్ట్యా తాజాగా దురంధర్‌ మూవీని సైతం అక్కడ రిలీజ్ చేశారు. దాదాపు 80 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. కానీ తొలి రోజే దురంధర్‌ మేకర్స్‌కు నిరాశ ఎదురైంది. ఈ స్పై చిత్రాన్ని తొలి రోజు కేవలం  900 మంది మాత్రమే వీక్షించారు.

ఈ చిత్రం జూలై 10న జపాన్ థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో ఆ దేశంలోని టాప్ 25 చిత్రాలలో స్థానం సంపాదించలేకపోయిందని స్థానిక ట్రేడ్ నివేదికల్లో వెల్లడైంది. తొలిరోజు కేవలం 900 టిక్కెట్లు మాత్రమే అమ్ముడవడంతో టాప్-10 ఇండియన్ సినిమాల జాబితాలో దురంధర్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' 1300 టికెట్స్‌తో చివరి స్థానంలో ఉండగా.. 'పుష్ప 2' గతంలో ఇదే మైలురాయిని చేరుకోలేకపోయింది. జపాన్‌లో రిలీజైన పుష్ప-2 మూవీకి కేవలం 886 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. తాజాగా దురంధర్‌కు 900 టికెట్స్‌ మాత్రమే బుకింగ్స్ లభించాయి. 

గతంలో జపాన్‌లో విడుదలైన మొదటి రోజే 8230 టికెట్లతో 'ఆర్ఆర్ఆర్' అతిపెద్ద ఇండియన్ ఓపెనర్‌ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 'సాహో', 'కల్కి 2898 ఏడీ', 'పఠాన్', 'సలార్', 'జవాన్', 'రంగస్థలం', 'దేవర', 'బాహుబలి 2' 'టైగర్ 3' సినిమాలు ఉన్నాయి.

మరోవైపు ధురందర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,813 కోట్లు వసూలు చేసి.. 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2025లో థియేటర్లలోకి వచ్చిన  'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా రూ. 1,307 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ చిత్రాలను జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్ కీలక పాత్రల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement