ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది.ఇప్పటికే తొలి టెస్టుకు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సేవలను కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో ఇద్దరు కీలక ప్లేయర్ల అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి. షెఫీల్డ్ షీల్డ్ (Sheffield Shield)లో ఆ జట్టు స్టార్ ప్లేయర్లు జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood), సీన్ అబాట్ (Sean Abbott) గాయపడ్డారు.
విక్టోరియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్న వారిద్దరూ తొడ కండరాల గాయం బారిన పడ్డారు. దీంతో మూడో రోజు లంచ్ తర్వాత ఈ ఇద్దరూ మైదానంలోకి తిరిగి రాలేదు. అయితే వారి గాయాల తీవ్రతపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఏదేమైనప్పటికి హాజిల్‌వుడ్ లాంటి ప్రధాన ఫాస్ట్ బౌలర్‌కు గాయం కావడం ఆసీస్ టీమ్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అబాట్ కూడా గత కొంతకాలంగా జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అబాట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మైదానం వీడే ముందు ఒక వికెట్ తీశాడు. హాజిల్‌వుడ్ మాత్రం ఒకే వికెట్ తీశాడు. కాగా నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ప్యాట్ కమ్మిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ జేక్ వెదరాల్డ్ అనూహ్యంగా తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్యాట్ కమిన్స్‌కు ప్రత్యామ్నాయంగా రైట్ ఆర్మ్ పేసర్ స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చాడు.
తొలి టెస్టుకు ఆసీస్ జట్టు
స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, జేక్ వెదరాల్డ్, కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్
చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?


