ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్(2025-26)కు తెర లేచింది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మొదటి టెస్టుకు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు.
దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సారథిగా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా జేక్ వెదరాల్డ్((31), బ్రెండన్ డాగెట్(31) ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేశారు. 30 ఏళ్ల వయస్సు దాటిన ఆటగాళ్లు టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున డెబ్యూ చేయడం 1946 తర్వాత ఇదే తొలిసారి.
75 ఏళ్ల కిందట వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై 30 ఏళ్ల దాటిన ఆటగాళ్లు ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేశారు. కాగా వెదరాల్డ్, డాగెట్‌లు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసీస్ జట్టులో చోటు దక్కింది.
మరోవైపు గాయం కారణంగా గత కొన్నాళ్లగా జట్టుకు దూరంగా ఉంటున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు ఒక్క స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగింది.
తుది జట్లు
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ , మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ , గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్
చదవండి: SL vs ZIM: శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే


