breaking news
Brendan Doggett
-
మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2026-27 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించింది. ఇందులో 21 మందికి చోటు దక్కింది. కాగా ఈ ఏడాది ఆగష్టు నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 12 నెలల కాలంలో 20 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన సీఏఈ నేపథ్యంలో టెస్టులకు సంబంధించి బిజీ షెడ్యూల్ కారణంగా.. వైట్‌బాల్ స్పెషలిస్టులు అయిన గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell), మ్యాట్ షార్ట్‌లకు సీఏ షాకిచ్చింది. గతేడాది వార్షిక కాంట్రాక్టులో ఉన్న వీరిద్దరిపై ఈసారి వేటు వేసింది. ఇక గతేడాది రిటైర్ అయిన ఉస్మాన్ ఖవాజా పేరును కూడా సీఏ తొలగించింది.మూడు ప్రపంచకప్‌లు గెలిచిన విజేతవీరితో పాటు గాయాలతో సావాసం చేస్తున్న ఫాస్ట్ బౌలర్ లాన్స్ మోరిస్ (Lance Morris)కు సైతం సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కాగా 37 ఏళ్ల గ్లెన్ మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డే వరల్డ్‌కప్, ఒక టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఘనుడు. అయితే, ఈసారి మాత్రం అతడిని సీఏ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను కూడా సీఏ పక్కనపెట్టింది. 20 ఏళ్ల ఈ బ్యాటర్‌కు బదులు.. 31 ఏళ్ల జేక్ వెదర్లాండ్ను సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చేర్చింది. మరోవైపు.. ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్ పేరును కూడా సీఏ తొలగించింది. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్ వారసుడిగా పేరొందిన రిచర్డ్సన్ను సీఏ పట్టించుకోకపోవడం విశేషం.వీరికి అవకాశంఅదే సమయంలో.. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో రాణించిన 31 ఏళ్ల బ్రెండన్ డాగెట్, 36 ఏళ్ల మైకేల్ నాజర్‌లకు సీఏ చోటు ఇచ్చింది. కాగా ఆగష్టులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో ఆసీస్ టెస్టు ప్రయాణం మొదలుకానుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఇండియా టూర్లకు వెళ్తుంది. ఆఖరిగా స్వదేవంలో ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్టు మ్యాచ్ ఆడుతుంది.క్రికెట్ ఆస్ట్రేలియా 2026-27 సీజన్‌కు గానూ ప్రకటించిన కాంట్రాక్టు ప్లేయర్ల జాబితాజేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, బ్రెండన్ డాగెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మైకేల్ నాజర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్లాండ్, బ్యూ వెబ్‌స్టర్, ఆడం జంపా.చదవండి: IPL 2026: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్ -
Ashes: ప్లేయింగ్ XII ప్రకటించిన ఆస్ట్రేలియా
సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుని జోష్‌లో ఉంది ఆస్ట్రేలియా. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు నాలుగో, ఐదు టెస్టులలోనూ సత్తా చాటి వైట్‌వాష్ చేయాలని పట్టుదలగా ఉంది.మరోసారి స్మిత్ సారథ్యంలో కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు (Aus Vs Eng Boxing Day Test) జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)కు విశ్రాంతినివ్వగా.. మరోసారి స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టుల మాదిరే ఈసారీ గెలుపు రుచి చూడాలని స్మిత్ భావిస్తున్నాడు.ఆ ముగ్గురి మధ్య పోటీఅయితే, కమిన్స్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ సైతం నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై కెప్టెన్ స్మిత్ అంచనాకు రాలేకపోయాడు. దీంతో పన్నెండు మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు స్థానాల కోసం పేసర్లు బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్ మధ్య పోటీ ఉందని స్మిత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.పిచ్‌కు అనుగుణంగాపచ్చగా ఉన్న మెల్బోర్న్ పిచ్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము తుదిజట్టును ఎంపిక చేసుకుంటామని స్మిత్ స్పష్టం చేశాడు. తద్వారా స్పిన్నర్ టాడ్ మర్ఫీకి మరోసారి మొండిచేయి తప్పదని సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో 82, 40 పరుగులతో ఆకట్టుకున్న ఉస్మాన్ ఖవాజా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు ఆస్ట్రేలియా ప్లేయింగ్ XIIట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా , అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్.బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండాన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.మరోవైపు ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల నొప్పితో దూరం కాగా.. ఓలీ పోప్‌ను తప్పించింది. వీరి స్థానాల్లో గస్ అట్కిన్సన్, జేకబ్ బెతెల్ వచ్చారు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్!


