breaking news
Brandon King
-
ఫేర్వెల్ మ్యాచ్‌లో రసెల్ ధనాధన్.. ఇంగ్లిస్ మొత్తం చెడగొట్టేశాడు!
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ (WI vs AUS)కు పరాభవమే ఎదురైంది. జమైకా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.సబీనా పార్కు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ(36 బంతుల్లో 51)తో రాణించగా.. కెప్టెన్ షాయీ హోప్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ షిమ్రన్ హెట్మెయిర్ (14) ఫెయిలయ్యాడు.రసెల్ సునామీ ఇన్నింగ్స్రోస్టన్ చేజ్ (16), రోవ్‌మన్ పావెల్ (12)లతో పాటు షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (0) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి దశలో విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) సునామీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 15 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు.One Final Show from Dre Russ 🚀A fitting last international innings from the West Indies all-rounder, showcasing the explosive talent that will be dearly missed by cricket fans everywhere 🥹#WIvsAus #AndreRussell pic.twitter.com/net68B3Woc— FanCode (@FanCode) July 23, 2025 మరోవైపు గుడకేశ్ మోటీ (9 బంతుల్లో 18 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్వెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. డ్వార్షుయిస్‌కు ఒక వికెట్ దక్కింది.ఆరంభంలోనే షాకులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మాక్సీ (12), అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (21) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ల వైఫల్యం నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.Rule 1: Don’t drop Josh Inglis 😤Rule 2: Read Rule 1 again.After two lives, he smashed 78* off 33 to bury West Indies. #AUSvWI pic.twitter.com/2tHN7yZiVn— FanCode (@FanCode) July 23, 2025దంచికొట్టిన ఇంగ్లిస్, గ్రీన్ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్‌కు తోడుగా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా అదరగొట్టాడు. 32 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన గ్రీన్.. 56 పరుగులతో ఇంగ్లిస్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మెరుపు అజేయ అర్థ శతకాల కారణంగా ఆస్ట్రేలియా.. 15.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్ల నష్టపోయి 173 పరుగులు చేసింది. తద్వారా విండీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి 2-0తో ఆధిక్యం పెంచుకుంది.ఫేర్వెల్ మ్యాచ్‌లో ఓటమేకాగా విండీస్ విధ్వంసకర వీరుడైన ఆండ్రీ రసెల్‌కు ఇది ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతడు ధనాధన్ దంచికొట్టినా.. ఇంగ్లిస్, గ్రీన్ల కారణంగా ఓటమితో కెరీర్ ముగించాల్సి వచ్చింది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన ఆసీస్.. టీ20 సిరీస్‌లో తొలి రెండు గెలిచి 2-0తో ముందంజలో ఉంది.చదవండి: ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే: అశ్విన్ -
చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్.. విండీస్‌దే సిరీస్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు విండీస్ పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. మొదటి టెస్టులో వెస్టిండీస్ 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టులో ఊహించని రీతిలో పుంజుకున్న బంగ్లా 101 పరుగుల తేడాతో విండీస్‌ను కంగుతినిపించింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది.అనంతరం.. సెయింట్ కిట్స్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే జోరులో మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలోనూ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వెస్టిండీస్.. బంగ్లాను 227 పరుగులకు ఆలౌట్ చేసింది.స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళబంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ తాంజిద్ హసన్(46) ఫర్వాలేదనిపించగా.. వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా అర్ధ శతకం(62)తో మెరిశాడు. వీరికి తోడు అనూహ్యంగా టెయిలెండర్ తంజీమ్ హసన్ సకీబ్ 45 పరుగులతో రాణించాడు. స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ.. ఈ బౌలర్ బ్యాట్ ఝులిపించి నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్ఇక విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటీ రెండు, మిండ్లే, రొమారియో షెఫర్డ్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 36.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 76 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 82 పరుగులు సాధించాడు.మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ 49 రన్స్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ షాయీ హోప్(17)తో కలిసి షెర్ఫానే రూథర్‌ఫర్డ్(24 ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు నష్టయి 230 పరుగులు చేసిన వెస్టిండీస్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. విండీస్ పేసర్ జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్- విండీస్ మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.చదవండి: SMT 2024: షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు -
కింగ్, కార్టీ విధ్వంసకర సెంచరీలు.. ఇంగ్లండ్‌పై విండీస్ ఘన విజయం
బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.ఇంగ్లీష్ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మోస్లీ(57), సామ్ కుర్రాన్(40), ఆర్చర్(38) పరుగులతో రాణించారు. కరేబియన్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, షెఫార్డ్ తలా రెండు వికెట్లు సాధించారు.కింగ్, కార్టీ ఊచకోత.. అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 43 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఆటగాళ్లు కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు, 128 నాటౌట్), బ్రాండెన్ కింగ్(117 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102) విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ, ఓవర్టన్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ నవంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా? -
కింగ్, లూయిస్ ఊచకోత.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లో చేధించింది.లక్ష్య చేధనలో విండీస్ ఓపెనర్లు బ్రాండెన్ కింగ్, ఈవెన్ లూయిస్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 33 బంతులు ఎదుర్కొన్న కింగ్ 11 ఫోర్లు, 1 సిక్స్‌లతో 63 పరుగులు చేయగా, లూయిస్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 రన్స్ చేశాడు. లంక బౌలర్లలో మతీషా పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా, హసరంగా, మెండిస్,థీక్షణ చెరో వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో కెప్టెన్ అసలంక(59, 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కమిందు మెండిస్(51) పరుగులతో రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు, అల్జారీ జోషఫ్, షెమర్ జోషఫ్, మోటీ,స్ప్రింగర్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆక్టోబర్ 15న దంబుల్లా వేదికగానే జరగనుంది.చదవండి: T20 WC: ఆసీస్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్‌కు చేరాలంటే? -
వెస్టిండీస్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
టీ20 వరల్డ్‌కప్-2024లో మిగిలిన మ్యాచ్‌లకు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో కింగ్‌కు పక్కటెముకుల గాయమైంది. అతడు పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని విండీస్ వైద్యబృందం వెల్లడించింది.ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విధ్వంసకర ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌తో విండీస్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. మైర్స్ భర్తీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదించింది. అతడు దక్షిణాఫ్రికాతో జరిగే తమ చివరి సూపర్-8 మ్యాచ్‌కు విండీస్ జట్టుతో చేరే అవకాశముంది. కాగా టీ20ల్లో మైర్స్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. టీ20ల్లో మైర్స్ 727 పరుగులతో పాటు 34 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఓటమి పాలైన కరేబియన్లు.. అమెరికాతో మ్యాచ్‌లో తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు.యూఎస్‌పై 9 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. విండీస్ తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో ఆదివారం(జూన్ 23) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ విండీస్‌కు చాలా కీలకం. -
ఓటమి బాధలో ఉన్న విండీస్‌కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
టీ20 వరల్డ్‌కప్ గ్రూపు స్టేజిలో అజేయంగా నిలిచిన వెస్టిండీస్‌కు సూపర్-8లో బిగ్ షాక్ తగిలింది. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఓటమి పాలైంది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్( 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.విండీస్‌కు బిగ్ షాక్..ఇక ఓటమి బాధలో ఉన్న కరేబియన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ గాయపడ్డాడు. సామ్కుర్రాన్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా షాట్ ఆడే సమయంలో కింగ్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో హఠాత్తుగా తీవ్రమైన నొప్పితో కింగ్ విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో కింగ్ మైదానాన్ని వీడాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. అయితే కింగ్ గాయంపై విండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. విండీస్ తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 22న అమెరికాతో తలపడనుంది.