విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో వాయుగుండం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16న మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా అది బలపడనుందని వివరించారు. తుపాన్‌గా మారిన తర్వాత ఉత్తర వాయవ్య దిశగా పయనించే ఛాన్స్ ఉందని చెప్పారు.
ఈ నెల 19న రాత్రి తీరానికి చేరే సమయంలో తుపాన్ తీవ్రతపై అంచనాలు మారే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఈనెల 18, 19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రేపు సాయంత్రంలోపు మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని ఐఎండీ హెచ్చరించింది.


