బంగాళాఖాతంలో అల్పపీడనం | Low pressure area in the Bay of Bengal | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడనం

Nov 12 2026 5:53 AM | Updated on Nov 12 2026 5:53 AM

Low pressure area in the Bay of Bengal

ఆదివారానికి వాయుగుండంగా బలపడే సూచన

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి సుస్పష్టమైన అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement