వైజాగ్ లేదా విశాఖపట్నం పేరు చెప్పగానే బీచ్, పచ్చని ప్రకృతి గుర్తొస్తుంది. సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకునే ఈ నగరంలో ఆధునికత, పట్టణీకరణ పేరుతో కొండల్ని తవ్వుతుండటంపై తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన సొంతు ఊరు అయిన వైజాగ్‌లో ప్రకృతి విధ్వంసం జరుగుతోందని రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: చాహల్ మాజీ భార్య తెలుగు సినిమా.. ఎట్టకేలకు రిలీజ్)
'నా సొంతూరు వైజాగ్ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అభివృద్ధి, పట్టణీకరణ పేరుతో ఎటు చూసినా కొండలు, పర్వతాలను నిర్దాక్షిణ్యంగా తవ్వేస్తున్నారు' అని ఇన్ స్టా పోస్టులో చాందిని చౌదరి రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈమెకు పర్యావరణ ప్రేమికులు, వైజాగ్ ప్రజలు మద్ధతు తెలుపుతున్నారు.
చాందిని చౌదరి విషయానికొస్తే.. విశాఖపట్నంకి చెందిన ఈమె షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించింది. 2015లో వచ్చిన 'కేటుగాడు' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'కుందనపు బొమ్మ', 'శమంతకమణి', 'హౌరా బ్రిడ్జి', 'మను' తదితర మూవీస్ చేసింది. అయితే 'కలర్ ఫోటో'.. ఈమెకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. రీసెంట్ టైంలో గామి, డాకు మహారాజ్ తదితర చిత్రాల్లో కనిపించింది.
(ఇదీ చదవండి: అప్పుడు డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయించారు.. దిల్ రాజు)


