టాలీవుడ్లోకి ప్రతి ఏడాది కొత్త కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అయితే వీళ్లలో సక్సెస్ అందుకుని నిలబడే వాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. కొందరు మాత్రం కొన్నాళ్ల పాటు మెరిసి మాయమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఈ బ్యూటీ ఒకరు. అప్పటితో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?
(ఇదీ చదవండి: తొలి రోజే కలెక్షన్ల సునామీ.. జైలర్ 2కు ఎన్ని కోట్లంటే?)
అవును మీరు ఊహించింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు సింధు తులానీ. ఈమె గతంలో హీరోయిన్గా చాలానే సినిమాలు చేసింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. 2003లో ఐతే మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. శింబుతో చేసిన మన్మధ.. ఈమె కెరీర్లో అతిపెద్ద బ్లాక్బస్టర్. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్లోనూ ఈ చిత్రం సంచలనం సృష్టించింది. తెలుగులో ఈమె హీరోయిన్గా చేసిన అతనొక్కడే మరో భారీ విజయాన్ని అందించింది. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూ మరోవైపు ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది.
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన సింధు తులానీ.. బతుకమ్మ లాంటి చిత్రాల్లో డీ గ్లామర్ రోల్స్ కూడా చేసింది. స్టార్ హీరోయిన్గా వెలిగిన తర్వాత సహాయ పాత్రల్లోనూ కనిపించింది. అలా ప్రేమ కావాలి, ఇష్క్, సన్ ఆఫ్ సత్యమూర్తి తదితర చిత్రాల్లో కనిపించింది. 2017లో 'చిత్రాంగద' తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. గతేడాది రిలీజైన 'ఆంధ్రా కింగ్ తాలూకా'లో ఉపేంద్ర భార్యగా కనిపించింది. ప్రస్తుతం ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ భర్త చేతన్ కుమార్తో కలిసి కుటుంబ జీవితం గడుపుతోంది. తాజాగా ఈమె పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుని కొత్త కారు కొనుగోలు చేసిన ఫొటోని పోస్ట్ చేసింది. ఇందులో గుర్తుపట్టలేనంతగా మారిపోయేసరికి టాలీవుడ్ ప్రేక్షకులు ఆలోచనలో పడిపోయారు.
(ఇదీ చదవండి: 'జైలర్ 2' సినిమాలో షో స్టీలర్.. ఎవరీ మూర్తి?)


