మీరు 'జైలర్ 2' చూశారా? ఒకవేళ చూస్తే ఏ పాత్ర మీకు బాగా నచ్చింది అని అడిగితే ఆలోచించకుండానే చాలామంది రజనీకాంత్ పేరు చెబుతారు. తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే మూర్తి పాత్ర చేసిన నటుడు భలే నవ్వించాడు కదా అని అంటారు. ఇతడేం కొత్త నటుడు కాదు. గత పద్దెనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ 'జైలర్ 2' దెబ్బకు ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. ఇంతకీ ఇతడెవరు? బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?
(ఇదీ చదవండి: తొలి రోజే కలెక్షన్ల సునామీ.. జైలర్ 2కు ఎన్ని కోట్లంటే?)
'జైలర్ 2'లో మూర్తి పాత్ర చేసిన నటుడి పేరు నమో నారాయణ. 2009లో వచ్చిన తమిళ మూవీ 'నాడోడిగళ్'తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర దర్శకుడు సముద్రఖని.. నారాయణకు బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్. సముద్రఖని.. ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్ అయిపోగా, నమో నారాయణ మాత్రం టీసీఎస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయ్యాడు. 'నాడోడిగళ్'తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఉద్యోగం మానేశాడు.

2009 నుంచి ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నమో నారాయణ కనిపించాడు. కాకపోతే 'జైలర్ 2'లో ఇతడిని ఉపయోగించుకున్న తీరు.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. చెప్పాలంటే ఫస్టాప్‌లో మిగతా పాత్రలని మూర్తి డామినేట్ చేసి పడేశాడు. సోషల్ మీడియాలోనూ ఈ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. ఫన్నీ ట్రోల్స్ అయితే నెటిజన్లని తెగ నవ్విస్తున్నాయి. క్రేజ్ చూస్తుంటే ఈ నటుడిని త్వరలో తెలుగు సినిమాల్లో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!
(ఇదీ చదవండి: ‘జైలర్ 2’ మూవీ రివ్యూ)


