సాక్షి, విశాఖపట్నం: ఏపీలో దక్షిణ కోస్తాకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. రాగల 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 15 నాటికి వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని.. తీరానికి చేరువయ్యే సమయంలో మరింత బలపడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంద్ర మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని.. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపానుగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
ఇటీవల అర్నాబ్ తుపాన్, మురసు తుపాన్లు ఏపీని వణికించిన సంగతి తెలిసిందే. ప్రధానం అర్నాబ్ తుపాన్ విధ్వంసం సృష్టించి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆపై వెంటనే మురసు తుపాన్ ప్రభావం కూడా ఏపీపై భారీగానే కనిపించింది. వెంట వెంటనే వచ్చిన ఈ రెండు తుపాన్ల నుంచి ఏపీ జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ మరో తుపాన్ ముప్పు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఇదీ చదవండి: సర్పంచ్ సీటుకు డిమాండ్.. ఎకరం పొలం.. 50 లక్షలు..


