ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. నవంబరు 21న చెన్నైలో జరగనున్న తమ కుమార్తె కావ్యా మారన్ - అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా కోరుతూ కళానిధి మారన్ దంపతులు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా కళానిధి మారన్, ఆయన సతీమణి దంపతులు కలిశారు.
రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా కోరారు. అనిరుధ్, కావ్య మారన్ల వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం నవంబరు 21న చెన్నైలో రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరుకానున్నారని సమాచారం.


