breaking news
Perplexity AI
-
భారత్‌లో చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు
చాట్‌జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీలాంటి ప్లాట్‌ఫాంల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎల్ఎం (లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్) మార్కెట్‌గా భారత్ ఎదిగిందని బ్రోకరేజీ సంస్థ బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. దీనితో స్వతంత్రంగా పనులను చక్కబెట్టగల ఏజెంటిక్ ఏఐ యాప్‌లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత్ టెస్ట్ బెడ్‌గా ఉపయోగపడగలదని పేర్కొంది. అయితే, దీనివల్ల దేశీయంగా స్టార్టప్ వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ వివరించింది.టెలికం సంస్థలు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటమనేది ఎల్ఎల్ఎం ఆధారిత యాప్‌ల వినియోగం పెరగడానికి ఒకానొక కారణంగా ఉంటోంది. అలాగే, నెలకు 2 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో 20 జీబీ డేటా ప్లాన్లు చౌకగా లభిస్తుండటం సైతం ఇందుకు దోహదపడుతోంది. నివేదిక ప్రకారం..14.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో భారత్‌లో చాట్‌జీపీటీ అగ్రగామి ఎల్ఎల్ఎంగా నిలుస్తోంది. 10.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే సగటున 6.5 కోట్ల మంది భారతీయులు చాట్‌జీపీటీని ఉపయోగిస్తుండగా, 1.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో ప్లేస్‌లో ఉంటోంది. చాట్‌జీపీటీ యూజర్లలో 16 శాతం మంది భారతీయులు ఉన్నారు. తద్వారా సదరు ప్లాట్‌ఫాంనకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దాని పోటీ సంస్థలకు కూడా భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. సగటున నెలవారీ గూగుల్ జెమినీ యూజర్లలో 30 శాతం మంది, పర్ప్లెక్సిటీ యూజర్లలో 38 శాతం మంది భారత్ నుంచే ఉంటున్నారు. జూలైలో చాట్‌జీపీటీ డౌన్లోడ్స్ 2.4 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎయిర్టెల్ బండిల్డ్ ప్యాకేజ్ దన్నుతో అక్టోబర్‌లో పర్ప్లెక్సిటీ డౌన్లోడ్స్ 2 కోట్ల గరిష్ట స్థాయిని తాకాయి.ఎల్ఎల్ఎం యాప్‌ల వినియోగం అందరికీ ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు, భాషపరమైన పరిమితులను అధిగమించి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటోంది. అటు తమ మోడల్స్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు కావల్సిన డేటా ఎల్ఎల్ఎంలకు లభిస్తోంది. ఇక టెల్కోల విషయం తీసుకుంటే తీవ్రమైన పోటీ ఉండే రంగంలో.. వీటిని ఆఫర్ చేయడం ద్వారా యూజర్లపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలవుతోంది. స్థానిక ఎల్ఎల్ఎంలు భారీ స్థాయికి ఎదిగేంత వరకు దేశీ స్టార్టప్‌లపై గ్లోబల్ ఎల్ఎల్ఎంల ప్రభావం కొనసాగుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్‌లాంటి ఉత్పత్తుల ద్వారా మెటా, గూగుల్‌లాంటి దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు! -
వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది?
భారతదేశపు అతి పిన్న వయసున్న బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్(31)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. చెన్నైలో జన్మించిన ఈయన పెర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడిగా, ఆ సంస్థ సీఈఓగా ఉన్నారు. దాంతోపాటు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.21,190 కోట్ల (సుమారు $2.5 బిలియన్లు) నికర విలువతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తమిళనాడులోని చెన్నైలో పెరిగిన అరవింద్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ పట్ల అభిరుచి పెంచుకున్నారు. తన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ సంపాదించారు. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ తన నైపుణ్యాలను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలతో కలిసి మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలో OpenAI, గూగుల్, డీప్ మైండ్ల్లో పనిచేశారు. ఇక్కడ అతను అత్యాధునిక ఏఐ నమూనాలు, ఎల్ఎల్ఎం(లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్)పై అనుభవం సాధించారు. ఇది అతని సొంత కంపెనీ స్థాపనకు కీలకంగా మారింది.పెర్ప్లెక్సిటీ ఏఐ2022లో శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్వినిస్క్తో కలిసి పెర్ప్లెక్సిటీ ఏఐను స్థాపించారు. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్ కాదు. ఇది ఒక ఇంటెరాక్షన్ ఏఐ సెర్చ్ ఇంజిన్. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి వేగవంతమైన మార్గంగా దీన్ని శ్రీనివాస్ అభివర్ణించారు. మార్కెట్లో తన పోటీదారులకు బలమైన ప్రత్యామ్నాయంగా పెర్ప్లెక్సిటీ నిలుస్తుంది. సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా హైపర్లింక్ల జాబితాను అందించడానికి బదులుగా పెర్ప్లెక్సిటీ ప్రత్యక్ష, ఇంటెరాక్షన్ సమాధానాలను అందిస్తుంది. ఇది మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐను రియల్‌టైమ్ వెబ్ డేటాతో విలీనం చేస్తుంది. ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీలో గుర్తింపు లభించింది. ఈ స్టార్టప్‌కు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో సహా అగ్రశ్రేణి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమకూరాయి.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?


