పీవీ సింధు నుదుటిపై గాడ్జెట్‌...ఆసక్తికర చర్చ | PV Sindhu Forehead Gadget Revealed: Truth Behind 'Temple' Wearable | Sakshi
Sakshi News home page

పింపుల్‌ కాదు..టెంపుల్‌.!

Aug 3 2026 6:28 AM | Updated on Aug 3 2026 12:13 PM

A Gadget on P V Sindhu Forehead

విశాఖ : ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం జరిగిన అవయవదానం అవగాహన సదస్సుకు హాజరైన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు నుదుటిపై ఉన్న పింపుల్‌.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె నుదుటిపై పెద్ద పులిపిరి కాయ వచ్చిందని కొందరు.. కాదు కాదు.. అది పింపుల్‌ అని మరికొందరు.. ఇలా చర్చించుకున్నారు. కానీ.. అసలు విషయం ఏంటంటే.. ఆమె ధరించింది.. ఒక గాడ్జెట్‌. దానిపేరే టెంపుల్‌.

ఇటీవల డెన్మార్క్‌ వేదికగా జరిగిన ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌ల్లో సింధు తొలిసారి.. నుదిటి కణతపై ఈ వెండిరంగు పరికరాన్ని ధరించి.. క్రీడాభిమానుల్ని ఆశ్చర్యంలో పడేసింది. టెంపుల్‌ అని పిలిచే ఈ అధునాతన వేరబుల్‌ గాడ్జెట్‌ను జొమాటో ఫౌండర్‌ దీపిందర్‌ గోయల్‌ రూపొందించారు. క్రీడాకారుల మెదడుకు వెళ్లే రక్త ప్రసరణని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.

ఆట సమయంలో వారి మానసిక ఒత్తిడి హెచ్చుతగ్గులు, నిద్ర సరిపోయిందా లేదా.? రికవరీ స్థాయిలు, మెటబాలిక్‌ రేటుని కచ్చితంగా అంచనా వేసేందుకు ఇది సహాయ పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి జయించి.. బ్యాడ్మింటన్‌ కోర్టులో మరింత ఏకాగ్రతతో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ఈ టెంపుల్‌... నా బెస్ట్‌ ఫ్రెండ్‌గా మారిందని సింధు  ‘సాక్షి’తో  చెప్పారు.

ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement