టీమిండియాకు భారీ షాక్‌ | Akash Deep to miss IND vs AFG Test after IPL heartbreak | Sakshi
Sakshi News home page

IND vs AFG: టీమిండియాకు భారీ షాక్‌

Apr 27 2026 3:16 PM | Updated on Apr 27 2026 3:20 PM

Akash Deep to miss IND vs AFG Test after IPL heartbreak

బుమ్రాతో ఆకాష్‌ దీప్‌(ఫైల్‌ ఫోటో)

ఐపీఎల్‌-2026 సీజన్ ముగిసిన త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది. తొలుత జూన్ 6 నుంచి 10 ముల్లాన్‌పూర్ వేదిక‌గా భార‌త్‌-అఫ్గాన్ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.

స్టార్ పేస‌ర్ ఆకాష్ దీప్ గాయం కార‌ణంగా ఈ ఏకైక టెస్టుకు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఆకాష్ ప్ర‌స్తుతం వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ గాయంతోనే అత‌డు ఐపీఎల్‌-2026 సీజ‌న్ నుంచి కూడా త‌ప్పుకొన్నాడు. గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో అత‌డిని రూ.కోటికి  కేకేఆర్ సొంతం చేసుకుంది.

కానీ అత‌డు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌కుండా వైదొలిగాడు. అత‌డు త‌న గాయం నుంచి కోలుకోవాడ‌నికి మ‌రో రెండు నెల‌ల స‌మయం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డు తిరిగి శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. భార‌త టెస్టు సెటాప్‌లో ఆకాష్ దీప్ కీల‌క స‌భ్యుడు.

జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తర్వాత టెస్టుల్లో మూడో పేసర్‌గా ఆకాష్ దీప్ ఉన్నాడు. చివ‌ర‌గా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో కూడా అతడు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచాడు. ఆ సిరీస్‌లో 3 టెస్టులు ఆడిన ఆకాష్ దీప్‌..13 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు. మ‌రి ఇప్పుడు అత‌డు గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ అత‌డి స్ధానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేస్తుందో చూడాలి.
చదవండి: IPL 2026: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం..! సీజన్‌ మధ్యలోనే?

Advertisement
 
Advertisement
Advertisement