రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం..! సీజన్‌ మధ్యలోనే? | LSG told to replace Rishabh Pant with Aiden Markram as captain in IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం..! సీజన్‌ మధ్యలోనే?

Apr 27 2026 1:03 PM | Updated on Apr 27 2026 2:07 PM

LSG told to replace Rishabh Pant with Aiden Markram as captain in IPL 2026

ఐపీఎల్‌-2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఆదివారం ఏకానా స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై సూప‌ర్ ఓవ‌ర్‌లో ల‌క్నో ఓట‌మి పాలైంది. గ‌త సీజ‌న్ మాదిరిగానే ఈ ఏడాది కూడా ల‌క్నోకు ఏదీ క‌లిసిరావ‌డం లేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ల‌క్నో.. ఆరింట ఓట‌మి పాలై పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానానికి చేరుకుంది. 

దీంతో ల‌క్నో దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు రేసు నుంచి నిష్క్ర‌మించిన‌ట్లే. ముఖ్యంగా రిష‌బ్ పంత్ కెప్టెన్‌గా త‌న మార్క్ చూపించ‌లేక‌పోతున్నాడు.  డగౌట్‌లో ప్లాన్లు నిమిష నిమిషానికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. కేకేఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇలాంటి లోపాలే స్ప‌ష్టంగా క‌న్పించాయి. 

ఆఖ‌రి ఓవ‌ర్‌లో దిగ్వేష్ రాఠీతో బౌలింగ్ చేయించ‌డం, సూప‌ర్ ఓవ‌ర్‌లో నికోల‌స్ పూర‌న్‌ను బ్యాటింగ్‌కు పంప‌డం వంటి నిర్ణ‌యాలు ల‌క్నో కొంప‌ముంచాయి. ఈ నేప‌థ్యంలో ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత‌పై భార‌త మాజీ ఓపెన‌ర్ వ‌సీం జాఫ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 

పంత్‌ను కెప్టెన్సీ  నుంచి త‌ప్పించి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్‌క్ర‌మ్‌కు అప్ప‌గించాల‌ని జాఫ‌ర్ సూచించాడు. "ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప్ర‌స్తుతం అయోమయ స్థితిలో ఉంది. వారి నుంచి ఇలాంటి ప్ర‌ద‌ర్శలు అస్స‌లు ఊహించలేదు. ఒక‌వేళ నేనే ల‌క్నో కోచింగ్ స్టాప్‌లో భాగ‌మైంటే వెంట‌నే కెప్టెన్సీ మార్పు చేస్తాను. పంత్‌ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను త‌ప్పించి మార్‌క్ర‌మ్‌కు అప్ప‌గించేవాడ‌ని. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కొన్ని మార్పులు చేసేవాడిని.

మార్క్రమ్, మిచెల్ మార్ష్‌లతో ఓపెనింగ్ చేయిస్తాను. . మూడో స్థానంలో నికోలస్ పూరన్, ఆ తర్వాత నాలుగో స్థానంలో రిషబ్ పంత్, ఐదో స్థానంలో ఆయుష్ బదోని. ఆరో స్థానంలో అబ్దుల్ సమద్, ఏడో స్థానంలో ముకుల్ చౌదరిలను బ్యాటింగ్‌కు పంపేవాడిని. పంత్ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ సెట్ కాదు. అతడు కేవలం బ్యాటర్‌గా గానే ఆడాలి. 

అప్పుడే అతడు పూర్తి స్వేఛ్చతో ఆడి మ్యాచ్‌లను గెలిపిస్తాడు. కాబట్టి కెప్టెన్సీ విషయంలో లక్నో పునరాలోచన చేయాలి. కెప్టెన్సీ బారంపై పంత్‌పై మోపొద్దు. అతడి స్ధానంలో మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా చేయండి. మార్‌క్రమ్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో సౌతాఫ్రికాను అతడు నడిపిస్తున్నాడు. 

అతడు అన్ని విధాలగా సమర్ధుడు అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. అయితే జాఫర్ ఒక్కడే కాదు చాలా మంది మాజీలు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. పంత్ కూడా అందుకు సముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పంత్‌ ఈ ఏడాది సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొగలనున్నాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా అతడి కెప్టెన్సీలోని లక్నో గత సీజన్‌లో కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement