అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో సిరాజ్‌కు టీమ్ మేనెజ్‌మెంట్ ప్రమోషన్ ఇచ్చింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే ముందే 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే సలీమ్ సఫీ వేసిన ఫుల్ టాస్ బంతిని మిడ్-వికెట్ మీదుగా అద్భుతమైన ఫోర్ కొట్టి సిరాజ్ తన ఖాతాను తెరిచాడు.
ఆ తర్వాత 120 ఓవర్ వేసిన అఫ్గాన్ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటేను ఈ హైదరాబాదీ ఉతికిరేశాడు. రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్‌గా మలిచిన సిరాజ్.. ఆ తర్వాత రెండు బంతులను వరుసగా బౌండరీలు బాదాడు. ఆ ఓవర్‌లో అతడు 14 పరుగులు పిండుకున్నాడు.
సాధారణంగా బంతితో అద్భుతాలు చేసే సిరాజ్.. ఇప్పుడు బ్యాట్‌తో మెరుపులు మెరిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అన్నా నీలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సిరాజ్ మొత్తంగా 183 స్ట్రైక్ రేట్‌తో 12 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.
ಧಮಾಕಾ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ Siuuuu Raj!🔥
ವೀಕ್ಷಿಸಿ | #INDvAFG | Only Test ➡️ DAY 2 | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports 2 ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#MohammedSiraj pic.twitter.com/6tomAfPYRb— Star Sports Kannada (@StarSportsKan) June 7, 2026


