జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ | Yashasvi Jaiswal Slams Century, India Beat Afg By 9 Wicketskts | Sakshi
Sakshi News home page

IND vs AFG: జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

Jun 20 2026 7:55 PM | Updated on Jun 20 2026 8:13 PM

Yashasvi Jaiswal Slams Century, India Beat Afg By 9 Wicketskts

చెన్నై వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన నామ‌మాత్ర‌పు మూడో వ‌న్డేలో 9 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ.. 28.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ అజేయ సెంచ‌రీతో సత్తాచాటాడు.

86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో సీనియర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌ రోహిత్‌ 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(20 నాటౌట్‌) దూకుడగా ఆడాడు. అఫ్గాన్‌ బౌలర్లలో నబీ ఒక్కడే వికెట్‌ సాధించాడు.

నిప్పులు చెరిగిన ప్రసిద్ద్‌
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 44.2 ఓవ‌ర్ల‌లో 218 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అఫ్గాన్ బ్యాటర్లకు టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ చుక్కలు చూపించాడు. ఈ కర్ణాటక స్పీడ్ స్టార్ ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.

అతడితో పాటు ప్రిన్స్‌ యాదవ్‌, హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌ తలా వికెట్‌ సాధించారు. అఫ్గాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హాష్మ‌తుల్లా షాహిది(102), ఓమ‌ర్జాయ్‌(50) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
చదవండి: IND vs AFG: భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement