Asia Cup 2026 Semi final: టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..? | ACC Mens U19 Asia Cup 2026 IND VS AFG: Afghanistan set 228 runs target to india | Sakshi
Sakshi News home page

Asia Cup 2026 Semi final: టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..?

Nov 12 2026 2:00 PM | Updated on Nov 12 2026 2:00 PM

ACC Mens U19 Asia Cup 2026 IND VS AFG: Afghanistan set 228 runs target to india

ఏసీసీ మెన్స్‌ అండర్‌ 19 ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులకే పరిమితమైంది.

ఇషాన్‌ సూద్‌ 3, ఆర్యన్‌ సవ్సని 2, కావ్య పటేల్‌, యశ్‌వర్దన్‌ చౌహాన్‌, అర్జున్‌ రాజ్‌పుత్‌ తలో వికెట్‌ తీశారు. ఆఫ్ఘన్‌ ఆటగాళ్లలో నొమన్‌ సలార్జాయ్‌ (51), షా ఫైసల్‌ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో కెప్టెన్‌ సొహైల్‌ ఖాన్‌ (36 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ప్లేయర్లలో సుభాన్‌ 31 పరుగులతో పర్వాలేదనిపించగా.. అబీదుల్లా 14, ఫరీదుల్లా 13, తాహిర్‌ 1, మొహమ్మద్‌ అలీ 8, నూర్‌ అలీ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. భారత్‌ 228 పరుగుల టార్గెట్‌ను ఛేదించాల్సి ఉంది. 

ఇదీ చదవండి: సెమీ ఫైనల్లో చెలరేగిన పాక్‌ బౌలర్లు.. బంగ్లా 138 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement