సెమీ ఫైనల్లో ఐదు వికెట్లతో చెలరేగిన పాక్‌ బౌలర్‌ | U19 Asia Cup 2026, Pakistan Bowlers Dominate Bangladesh And Bowl Them Out For Just 138 Runs In Semifinal Showdown | Sakshi
Sakshi News home page

Asia Cup: సెమీ ఫైనల్లో చెలరేగిన పాక్‌ బౌలర్లు.. బంగ్లా 138 ఆలౌట్‌

Nov 12 2026 1:31 PM | Updated on Nov 12 2026 1:42 PM

ACC Mens U19 Asia Cup 2026 Semis: Pakistan Bowled Out Bangladesh 138

PC: ACC Media X

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2026 సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లాదేశ్‌ను 138 పరుగులకే ఆలౌట్‌ చేశారు. కాగా అల్‌ ఎమిరెట్‌ వేదికగా ఈ వన్డే టోర్నీలో గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో భాగంగా పాక్‌- బంగ్లాదేశ్‌ బరిలోకి దిగాయి.

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ అబ్దుల్లా అల్‌ మూహి అర్ధ శతకం (50)తో ఆకట్టుకోగా.. మిగిలిన వారిలో అల్‌ రఫీ (20), రకీబుల్‌ హసన్‌ (26) మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్ల ధాటికి మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు తిరిగి వెళ్లిపోయారు. దీంతో కేవలం 31.4 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి బంగ్లాదేశ్‌ ఆలౌట్‌ అయింది.

పాక్‌ యువ పేసర్‌ రిజ్వానుల్లా ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. మిగితా వారిలో మహ్మద్‌ సయ్యాం రెండు వికెట్లు తీయగా.. అలీ రెజా, హస్నైన్‌ అబ్బాస్‌ దర్‌, అహ్మద్‌ హుసేన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

కాగా గ్రూప్‌ దశలో ‘ఎ’ విభాగం నుంచి పోటీపడిన పాకిస్తాన్‌.. యూఏఈ, భారత్‌, నేపాల్‌ జట్లను ఓడించింది. తద్వారా మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా నిలిచి  సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇక ఇదే గ్రూపు నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన భారత్‌.. అఫ్గానిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. యూఏఈ, నేపాల్‌తో పాటు.. శ్రీలంక, మలేషియా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఇదీ చదవండి: IND vs NZ: నాలుగో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!.. ఓపెనర్లుగా వీరే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement