శుబ్‌మన్‌ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా | Shubman Gill Creates History, Becomes First Indian Ever To | Sakshi
Sakshi News home page

IND vs AFG: శుబ్‌మన్‌ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా

Jun 17 2026 7:52 PM | Updated on Jun 17 2026 8:09 PM

Shubman Gill Creates History, Becomes First Indian Ever To

టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఐపీఎల్‌-2026లో దుమ్ములేపిన గిల్‌.. ఇప్పుడు అదే జోరును అఫ్గానిస్తాన్ సిరీస్‌లో క‌న‌బ‌రుస్తున్నాడు. ల‌క్నో వేదిక‌గా అఫ్గాన్‌తో రెండో వ‌న్డేలో గిల్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 

కేవ‌లం 77 బంతుల్లోనే త‌న 9వ వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 110 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు చేశాడు. ఈ అద్భుత శతకంతో వన్డే క్రికెట్‌లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు.

తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్‌ను గిల్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(72 ఇన్నింగ్స్‌లు) పేరిట సంయుక్తంగా ఉండేది.

తాజా నాక్‌తో వారిద్దరిని శుబ్‌మన్ అధిగమించాడు. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌(2995) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో గిల్‌(3016) ఉన్నాడు. అదేవిధంగా వన్డేల్లో ఫాస్టెస్ట్ 150 చేసిన మూడో ప్లేయర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను గిల్ అధిగమించాడు.

సెహ్వాగ్‌ 2011లో వెస్టిండీస్‌పై 112 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించగా.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో గిల్‌ కేవలం 108 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్‌ కిషన్‌(103) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది.
చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీకి బీసీసీఐ భారీ షాక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement