శ్రీలంక-ఎ జట్టు ప్లేయర్‌తో గొడవపడిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలింది. అతడి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించింది. వైభవ్‌తో పాటు ఇండియా-ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మపై కూడా 30 శాతం జరిమానా పడింది.
మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబెజ్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది. అతడి మ్యాచ్‌లో కూడా 50 శాతం కోత విధించారు.
ఏమి జరిగిదింటే?
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జూన్ 15న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఎ' జట్టు విజయం సాధించింది. 17 పరుగుల టార్గెట్‌ను భారత్ చేధించలేకపోయింది. అయితే సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం శ్రీలంక యువ ఆటగాడు విషేన్ హలంబెజ్ శృతిమించి ప్రవర్తించాడు.
ఓటమి బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి.. “ఇక లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళు.. ఇది ఐపీఎల్ కాదు” అని వ్యంగ్యంగా అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. హలంబెజ్ వైపు దూసుకెళ్లి అతని ఛాతీపై బలంగా నెట్టాడు. లంక ఆటగాడు కూడా ప్రతిఘటించడంతో ఇద్దరి తీవ్ర వాగ్వదం మొదలైంది. తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది.
అంతకుముందు వెలుతురు సరిగ్గా లేకపోయినప్పటికి అంపైర్లు సూపర్ ఓవర్ నిర్ణయించడం పట్ల భారత కెప్టెన్ తిలక్ వర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహణ, నో-బాల్ కాల్స్ వంటి విషయాల్లో అంపైర్లతో తిలక్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తిలక్‌పై కూడా బోర్డు క్రమశిక్షణా చర్యలు చర్యలు తీసుకుంది.
చదవండి: అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్


