టీమిండియాతో సిరీస్‌లకు ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల ప్రకటన | Afghanistan Squads For India Tour Announced | Sakshi
Sakshi News home page

టీమిండియాతో సిరీస్‌లకు ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల ప్రకటన

May 26 2026 7:21 PM | Updated on May 26 2026 7:25 PM

Afghanistan Squads For India Tour Announced

ఐపీఎల్‌ 2026 ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా-ఆఫ్ఘన్‌ జట్ల మధ్య ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌, 3 వన్డేల సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరు ఆఫ్ఘనిస్తాన్‌ జట్లను ఇవాళ (మే 26) ప్రకటించారు. ఈ రెండూ ఫార్మాట్ల జట్లకు హష్మతుల్లా షాహిది కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంగా ఉంది.

ఇటీవలికాలంలో ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో లేకపోయినా, కీలక పర్యటన కావడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు.

వన్డే జట్టులో అనుభవజ్ఞులైన రహ్మత్‌ షా, రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. వికెట్‌కీపర్లుగా అఫ్సర్‌ జజాయ్‌, ఇక్రామ్‌ అలీఖిల్‌లను ఎంపిక చేశారు.

బౌలింగ్‌ విభాగంలో స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతడి అనుభవం భారత పిచ్‌లపై ఆఫ్ఘనిస్తాన్‌కు కీలకంగా మారనుంది.

2027 వన్డే వరల్డ్‌కప్‌ దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్‌ కీలకంగా మారింది. బెంచ్‌ స్ట్రెంత్‌ను పరీక్షించుకోవడం, కొత్త కాంబినేషన్లను సిద్ధం చేయడం ఈ సిరీస్‌ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. 

మరోవైపు టెస్టు ఫార్మాట్‌లో భారత్‌ లాంటి బలమైన జట్టుతో ఆడటం ఆఫ్ఘనిస్తాన్‌కు విలువైన అనుభవాన్ని అందించనుంది. గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ సిరీస్‌ పెద్ద పరీక్షగా మారింది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత‌ పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్‌ వన్డే జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), అబ్దుల్‌ మాలిక్‌, సెదీకుల్లా అతల్‌, రహ్మత్‌ షా, రహ్మనుల్లా గుర్బాజ్‌, రహ్మనుల్లా జద్రాన్‌, అఫ్సర్‌ జజాయ్‌, ఇక్రామ్‌ అలీఖిల్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, షరఫుద్దీన్‌ అష్రఫ్‌, నంగ్యాల్‌ ఖరోటాయ్‌, ఖైస్‌ అహ్మద్‌, బిలాల్‌ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ, రషీద్‌ ఖాన్‌.

భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్‌ టెస్టు జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), అబ్దుల్‌ మాలిక్‌, సెదీకుల్లా అతల్‌, రహ్మత్‌ షా, రహ్మనుల్లా గుర్బాజ్‌, రహ్మనుల్లా జద్రాన్‌, అఫ్సర్‌ జజాయ్‌, ఇక్రామ్‌ అలీఖిల్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, షరఫుద్దీన్‌ అష్రఫ్‌, నంగ్యాల్‌ ఖరోటాయ్‌, ఖైస్‌ అహ్మద్‌, బిలాల్‌ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ.

ఆఫ్ఘనిస్తాన్‌ భారత పర్యటన షెడ్యూల్‌

  • ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌- జూన్‌ 6-10 (ముల్లాన్‌పూర్‌)
  • తొలి వన్డే- జూన్‌ 14 (ధర్మశాల)
  • రెండో వన్డే- జూన్‌ 17 (లక్నో)
  • మూడో వన్డే- జూన్‌ 20 (చెన్నై)

 

 

Advertisement
 
Advertisement
Advertisement