మ‌రికొన్ని గంట‌ల్లో మ్యాచ్‌.. అంత‌లోనే స్టార్‌ క్రికెట‌ర్ తండ్రి మ‌ర‌ణం | IND vs AFG 1st ODI: Darwish Rasooli leaves Afghanistan camp after father's demise | Sakshi
Sakshi News home page

IND vs AFG: మ‌రికొన్ని గంట‌ల్లో మ్యాచ్‌.. అంత‌లోనే స్టార్‌ క్రికెట‌ర్ తండ్రి మ‌ర‌ణం

Jun 13 2026 7:44 AM | Updated on Jun 13 2026 8:06 AM

IND vs AFG 1st ODI: Darwish Rasooli leaves Afghanistan camp after father's demise

భార‌త్‌-అఫ్గానిస్తాన్ మ‌ధ్య తొలి వ‌న్డే ధ‌ర్మ‌శాల వేదిక‌గా శ‌నివారం జ‌ర‌గ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ క్యాంప్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ దర్విష్ రసూలీ తండ్రి గురువారం(జూన్ 11) కన్నుమూశారు.

దీంతో వెంటనే రసూలీ తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఉన్నపళంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించాడు.

"దర్విష్ రసూలీ తండ్రి మరణించినట్లు మాకు గత రాత్రి తెలిసింది.  ఇది చాలా బాధకరం. ఈ కష్టసమయంలో అతడు తన కుటుంబ సభ్యుల వద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు అఫ్గాన్‌కు తిరిగి వెళ్లిపోయాడు" అని షాహిదీ పేర్కొన్నాడు.

ఇప్పుడు రసూలీ  లేకపోవడంతో తుది జట్టు ఎంపికకు అఫ్గాన్ వద్ద 14 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. యాదృఛ్చికంగా భారత్ వద్ద కూడా అంతే మంది ఉన్నారు. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానాన్ని బీసీసీఐ ఇంకా భర్తీ చేయలేదు.

కాగా దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న రసూలీ ఇప్పటివరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ధర్మశాల వేదికగా అతడు భారత్‌పై వన్డే డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. అంతలోనే అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇప్పటికే అఫ్గానిస్తాన్ తరఫున 28 టీ20లు ఆడిన రసూలీకి లిస్ట్-ఎ  క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 54.94 సగటుతో, 93.79 స్ట్రైక్ రేట్‌తో 3,022 పరుగులు చేశాడు. అతడు  తిరిగి జూన్ 17న లక్నోలో జరిగే రెండో వన్డే సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.

అఫ్ఘనిస్తాన్ జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ,  ఘజన్‌ఫర్, బిలాల్ రాసోలీ, ఫాలీద్ సమీ, ఫాలీద్ సమీ, రెహమాన్ షరీఫీ
చదవండి: IND Vs AFG: రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్‌తో తొలి వన్డేకు డౌట్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement