అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు.
కానీ అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్‌తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్‌తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రానున్నాడు.
ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.
Rohit Sharma very rusty in the nets so far.
Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026


