ధర్మశాల వేదికగా తొలి వన్డేలో భారత్-అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో భారత్ తమ వన్డే ప్రపంచకప్-2027 ప్రిపరేషన్స్‌ను ప్రారంభించనుంది. విరాట్ కోహ్లి అందుబాటులో లేకపోయినప్పటికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ప్లేయర్ల ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచింది. శనివారం మ్యాచ్ జరిగే సమయం (మధ్యాహ్నం 1:30)లో భారీ వర్షం పడేందుకు అస్కారముందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అక్యూవెదర్.కామ్ ప్రకారం.. ధర్మశాలలో ఈరోజు రోజంతా భారీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య 90 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆ తర్వాత సాయత్రం వర్షం తగ్గుతుందని తెలిపింది. అయితే మళ్లీ రాత్రి వేళ వర్షం పడే అవకాశం 65 శాతం ఉండడంతో మ్యాచ్ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు.
కాగా ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. కోహ్లి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో భర్తీ చేశారు. కానీ హార్దిక్ పాండ్యా రిప్లేస్‌మెంట్‌ను బీసీసీఐ ప్రకటించలేదు. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్
చదవండి: IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు?


