ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెటర్‌ అరెస్టు | IPL Cricketer Abhishek Porel Arrested On Woman Allegations | Sakshi
Sakshi News home page

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెటర్‌ అరెస్టు

Aug 11 2026 2:48 PM | Updated on Aug 11 2026 3:01 PM

IPL Cricketer Abhishek Porel Arrested On Woman Allegations

PC: Instagram

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెటర్‌ అభిషేక్‌ పోరెల్‌ అరెస్టయ్యాడు. అత్యాచార ఆరోపణల కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బెంగాల్‌కు చెందిన అభిషేక్‌ పోరెల్‌ 2023లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 24 ఏళ్ల ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఇప్పటికి 35 మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేశాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
క్యాపిటల్స్‌ కీలక ప్లేయర్లలో ఒకడిగా ఎదిగిన అభిషేక్‌ పోరెల్‌పై జూన్‌లో అత్యాచార ఆరోపణలతో కేసు నమోదైంది. గత మూడేళ్లుగా తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న పోరెల్‌.. ఏడాది కాలంగా తనను దూరం పెట్టాడని వైద్య విద్యార్థిని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అన్ని రకాలుగా వాడుకున్నాడని ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో తనపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. తమ వ్యక్తిగత వీడియోలు రికార్డు చేసి ఇప్పుడు వాటిని చూపించి బెదిరిస్తున్నాడని  బాధితురాలు తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగాల్‌ పోలీసులు తెలిపారు. 

హైకోర్టు ఆదేశాలతో..
ఈ క్రమంలో అభిషేక్‌ పోరెల్‌ మొబైల్‌ ఫోన్‌ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను వెంటనే సీజ్‌ చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో డుమ్‌ డుమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇమామి సిటీ పోలీసులు అభిషేక్‌ పోరెల్‌ను తాజాగా అరెస్టు చేసినట్లు సమాచారం. హూగ్లీ రూరల్‌ పోలీస్‌ ఎస్పీ కున్వార్‌ భూషణ్‌ సింగ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

కాగా అభిషేక్‌ పోరెల్‌ గతంలో భారత్‌-ఎ క్రికెట్‌ జట్టు తరఫున యూకే, ఆస్ట్రేలియా గడ్డ మీద మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని అభిషేక్‌ పోరెల్‌ కొట్టిపారేశాడు. కాగా బెంగాల్‌ తరఫున 2021-11 సీజన్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అభిషేక్‌ పోరెల్‌.. 32 మ్యాచ్‌లు ఆడాడు. ఇక లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అతడు 23 మ్యాచ్‌లలో భాగమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement