చరిత్ర సృష్టించిన మిచెల్‌ మార్ష్‌.. తొలి క్రికెటర్‌ | Mitchell Marsh becomes the first player to be part of all Sunrisers Franchises | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన మిచెల్‌ మార్ష్‌.. తొలి క్రికెటర్‌

Aug 5 2026 9:30 PM | Updated on Aug 5 2026 9:30 PM

Mitchell Marsh becomes the first player to be part of all Sunrisers Franchises

source: X

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీలకు (మూడు జట్లకు) ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

మార్ష్‌ ఇప్పటికే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున.. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్‌ టోర్నీలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

తాజాగా అతను దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ SA20లోకి కూడా అడుగుపెట్టాడు. సీజన్‌-5 కోసం సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ అతడిని జట్టులోకి తీసుకుంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌.. ఈ మూడు గ్లోబల్‌ ఫ్రాంచైజీలకు ఆడిన తొలి ఆటగాడిగా మారాడు.

కాగా, SA20 2027 సీజన్‌కు సంబంధించి ఆరు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ సైనింగ్‌లను ఖరారు చేశాయి. చాలామంది స్టార్‌ ప్లేయర్లు ప్రీ-ఆక్షన్‌ సైనింగ్స్‌లో భాగమయ్యారు. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ సామ్‌ కర్రన్‌తో, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ జేసన్‌ హోల్డర్‌తో, ఎంఐ కేప్‌టౌన్‌ విల్‌ జాక్స్‌తో, పార్ల్‌ రాయల్స్‌ జో రూట్‌తో, ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఫిల్‌ సాల్ట్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement