పిల్లలూ! ఈ ఫోటోలో అక్క తలపై ఒక టోపీ ఉంది కదా? గొడుగులా, గిన్నెలా ఉంది కదా? దీని పేరు ‘కోన్ హ్యాట్’ లేదా ‘రైస్ హ్యాట్’. వేరు వేరు దేశాల్లో దీనికి వేరు పేర్లు ఉన్నాయి. వియత్నాంలో– ‘నోన్ లా’, చైనాలో– ‘డౌలి’, మయన్మార్‌లో– ‘ఖమాక్’... మనం దీన్ని ‘గడ్డి టోపీ’ లేదా ‘వర్షపు టోపీ’ అని పిలవచ్చు. ఈ టోపీ స్పెషల్ ఏంటి? వర్షం నుండి కాపాడుతుంది. పైన వెడల్పుగా కోన్ ఆకారంలో ఉండడం వల్ల వర్షపు నీళ్లు ముఖంపై పడవు.
ఎండ నుండి కాపాడుతుంది. ఎండలో పని చేసేటప్పుడు ముఖం నల్లగా కాకుండా ఈ టోపీ నీడ ఇస్తుంది. దీన్ని వెదురు, గడ్డి, తాటి ఆకులతో అల్లుతారు. అందుకే తలపై బరువు ఉండదు. ఈ అక్క చూడండి వర్షంలో కోన్ హ్యాట్ పెట్టుకుని హాయిగా సైకిల్ తొక్కుతోంది. చేతిలో గొడుగు పట్టుకోలేదు. ఎందుకంటే టోపీయే ఆమెకు గొడుగు! మనం ఏం నేర్చుకోవాలి? మనుషులు తమకు కావాల్సిన వస్తువులను బుర్రతో ఆలోచించి ప్రకృతి ఇచ్చిన వస్తువులతో తయారు చేసుకుంటారు.


