IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ | IND vs AFG 3rd ODI: Toss Playing XIs Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Jun 20 2026 1:02 PM | Updated on Jun 20 2026 7:55 PM

IND vs AFG 3rd ODI: Toss Playing XIs Updates And Highlights

చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్‌)తో చెలరేగగా.. రోహిత్‌ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించిన గిల్‌ సేన.. లక్నో మ్యాచ్‌లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.

Updates: 
చెన్నై వేదికగా టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్‌ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్‌ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్‌కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది.

25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1
జైసూ 81, అయ్యర్‌ 4 పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
22.5: నబీ బౌలింగ్‌లో సెదీకుల్లాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన రోహిత్‌ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.

21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0
రోహిత్‌ శర్మ 65, యశస్వి జైస్వాల్‌ 75 పరుగులతో ఉన్నారు.

రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
15.2: రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ.  47 బంతుల్లో హాఫ్‌ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.

జైస్వాల్‌ అర్ద శతకం
11.3: రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌

పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0
యశస్వి జైస్వాల్‌ 46, రోహిత్‌ 27 పరుగులతో ఉన్నారు.

తొలి ఓవర్లోనే 23 పరుగులు
5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్‌ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. 

చెలరేగిన ప్రసిద్‌.. అఫ్గాన్‌ ఆలౌట్‌
భారత పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ అఫ్గాన్‌ టాపార్డర్‌ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్‌ (5), రహ్మత్‌ షా (5), ఇబ్రహీం జద్రాన్‌ (11) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 102 పరుగులు చేశాడు. 

అయితే, ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్‌ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్‌ ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్‌, ప్రిన్స్‌, హర్ష్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

అఫ్గాన్‌ కెప్టెన్‌ సెంచరీ
అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
41.1: వాషింగ్టన్‌ సుందర్ బౌలింగ్‌లో హష్మతుల్లా సింగిల్‌కు వెళ్లగా ఫరీద్‌ రనౌట్‌ (0). స్కోరు: 206-9(41.2).

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
40.6: హర్ష్‌ దూబే బౌలింగ్‌లో.. హష్మతుల్లా షాహిది సింగిల్‌కు వెళ్లగా.. ఘజన్‌ఫర్‌ (1) రనౌట్‌ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్‌ మాలిక్‌ క్రీజులోకి వచ్చాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
40.3: హర్ష్‌ దూబే బౌలింగ్‌లో ప్రిన్స్‌ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరిన రషీద్‌ ఖాన్‌ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.

ఆరో వికెట్‌ డౌన్‌
37.1: గుర్నూర్‌ బ్రార్‌ బౌలింగ్‌లో మహ్మద్‌ నబీ (21) బౌల్డ్‌. స్కోరు: 200-6(37.2). రషీద్‌ ఖాన్‌ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
28.2: ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన అజ్మతుల్లా (50).  

అజ్మతుల్లా అర్ధ శతకం
27.3: వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్‌ హాఫ్‌ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. 

హష్మతుల్లా హాఫ్‌ సెంచరీ
15.5: వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్‌. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.

22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్‌: 108/4
22 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్‌ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్‌(36) ఉన్నారు.

పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్‌ స్కోరు: 69-4(15)
హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.

పవర్‌ ప్లేలో అఫ్గానిస్తాన్‌ స్కోరు: 37-4 (10)
హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
9.2: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన డార్విష్‌ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్‌ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)

మూడో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
7.2: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన ఇబ్రహీం జద్రాన్‌ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్‌ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.

రెండో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
5.6: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి రహ్మత్‌ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్‌ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. 

ఐదు ఓవర్లలో అఫ్గాన్‌ స్కోరు: 22-1(5)
రహ్మత్‌ ఒకటి, జద్రాన్‌ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
1.1: ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్‌ (5). క్రీజులోకి రహ్మత్‌ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్‌ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.

తుదిజట్లలో మార్పులు
ఈ సందర్భంగా కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, జియా ఉర్‌ రహ్మాన్‌లు తిరిగి రాగా.. ఫరీద్‌ మాలిక్‌కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. 

రాహుల్‌పై వేటు!
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌కు బదులు హర్ష్‌ దూబే రాగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, కేఎల్‌ రాహుల్‌ స్థానాల్లో ప్రసిద్‌ కృష్ణ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చోటు దక్కించుకున్నారు.

సిరీస్‌ భారత్‌ కైవసం
కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్‌.. లక్నో మ్యాచ్‌లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం కావడం విశేషం.

తుదిజట్లు
భారత్‌
యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌, ప్రసిద్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్‌.

అఫ్గానిస్తాన్‌
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్‌ ఘజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement