ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ద్‌.. కుప్పకూలిన అఫ్గానిస్తాన్‌ | IND vs AFG 3rdi Odi: Afghanistans 218 all out in Chennai ODI | Sakshi
Sakshi News home page

IND vs AFG: ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ద్‌.. కుప్పకూలిన అఫ్గానిస్తాన్‌

Jun 20 2026 5:16 PM | Updated on Jun 20 2026 5:28 PM

IND vs AFG 3rdi Odi: Afghanistans 218 all out in Chennai ODI

భారత ఫాస్ట్‌ బౌలర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ నిప్పులు చెరిగాడు. తన అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును ప్రసిద్ద్‌ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ కర్ణాటక పేసర్‌ 8.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. 

అతడితో పాటు హర్ష్‌దూబే, గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు చేసిన అఫ్గాన్‌ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్‌ విరోచిత శతకం
ఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి అఫ్గాన్‌ కెప్టెన్‌ హస్మతుల్లా షాహిది మాత్రం విరోచిత సెంచరీ సాధించాడు. 131 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 102 పరుగులు చేశాడు. అతడితో పాటు అజ్మతుల్లా ఓమర్జాయ్‌(50) హాఫ్‌ సెంచరీతో సహకారం అందించాడు. మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.

తుదిజట్లు
భారత్‌
యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌, ప్రసిద్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్‌.

అఫ్గానిస్తాన్‌
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్‌ ఘజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement