రిటైర్డ్ హర్ట్‌, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే? | Afghan Batter-Abs-Hurt Vs IND Test Fans-Check-What-Absent Hurt | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ హర్ట్‌, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?

Jun 8 2026 5:20 PM | Updated on Jun 8 2026 5:29 PM

Afghan Batter-Abs-Hurt Vs IND Test Fans-Check-What-Absent Hurt

ఆఫ్గన్‌ బ్యాటర్‌ షరాఫుద్దీన్‌ అష్రఫ్‌

క్రికెట్‌లో మ‌నకు తెలియని ప‌దాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మ‌న‌కు ముఖ్యంగా వినిపించే ప‌దాలు క్యాచ్ అవుట్‌, ర‌నౌట్‌, రిటైర్డ్ హ‌ర్ట్ అనేవి కామ‌న్‌గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన ఏకైక టెస్టులో ఆఫ్గ‌న్ రెండో ఇన్నింగ్స్‌లో ష‌రాఫుద్దీన్ అష్ర‌ఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. 

కాలి గాయంతో బాధ‌ప‌డుతున్న అష్ర‌ఫ్ ఆబ్సెంట్ హ‌ర్ట్ (ఏబీఎస్ హ‌ర్ట్‌) అయిన‌ట్లు అంపైర్ ప్ర‌క‌టించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయిన‌ట్లు బిగ్‌స్క్రీన్‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. దీంతో ఆబ్సెంట్ హ‌ర్ట్ అనే ప‌దం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఆబ్సెంట్ హ‌ర్ట్ అంటే?
ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బ‌రిలోకి దిగ‌క‌పోతే దీనిని ఏబీఎస్ హ‌ర్ట్‌గా సూచిస్తారు. గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని నిరూపిస్తూ కంకషన్ అని ప్ర‌క‌టిస్తే త‌ప్ప‌, అత‌డి స్థానంలో మరొక బ్యాట‌ర్‌ను ఆడించేందుకు వీలుండదు. 

ఆ స‌మ‌యంలో స‌ద‌రు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వ‌స్తుంది. ఆఫ్గ‌న్ బ్యాట‌ర్ అష్ర‌ఫ్ గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో జ‌ట్టు మేనేజ్‌మెంట్ అత‌డిని బ్యాటింగ్‌కు పంప‌లేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంత‌రం ఆఫ్గ‌న్ ఆలౌటైన్లు ప్ర‌క‌టించారు.

రిటైర్డ్ హ‌ర్ట్ అంటే?
ఇక రిటైర్డ్ హ‌ర్ట్ అంటే మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే. బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో గాయానికి గురైతే మైదానం వీడ‌డం, ట్రీట్‌మెంట్ తీసుకున్న త‌ర్వాత తాను ఆడ‌గ‌ల‌న‌నుకుంటే మ‌ళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హ‌ర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్‌ క్రికెట్‌లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.

రిటైర్డ్ ఔట్ అంటే?
మ్యాచ్‌లో ఒక ఆట‌గాడు గాయం లేదా అంపైర్ అనుమ‌తి లేకుండా త‌నంత‌ట తానుగా క్రీజు వీడ‌డాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మ‌ళ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.  జ‌ట్టు స్కోరు పెంచాల‌నుకునే క్ర‌మంలో హిట్ట‌ర్‌కు అవ‌కాశం ఇచ్చేందుకు ఈ మ‌ధ్య‌న రిటైర్డ్ ఔట్‌ను ఆయా జ‌ట్లు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాయి.

చదవండి: ఆఖ‌ర్లో గంద‌ర‌గోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్‌!

Advertisement
 
Advertisement
Advertisement