Absent Hurt
-
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?
క్రికెట్లో మనకు తెలియని పదాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా వినిపించే పదాలు క్యాచ్ అవుట్, రనౌట్, రిటైర్డ్ హర్ట్ అనేవి కామన్‌గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్గన్ రెండో ఇన్నింగ్స్‌లో షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయినట్లు బిగ్స్క్రీన్పై ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆబ్సెంట్ హర్ట్ అనే పదం చర్చకు దారి తీసింది.ఆబ్సెంట్ హర్ట్ అంటే?ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్‌గా సూచిస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని నిరూపిస్తూ కంకషన్ అని ప్రకటిస్తే తప్ప, అతడి స్థానంలో మరొక బ్యాటర్‌ను ఆడించేందుకు వీలుండదు. ఆ సమయంలో సదరు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వస్తుంది. ఆఫ్గన్ బ్యాటర్ అష్రఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జట్టు మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్‌కు పంపలేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంతరం ఆఫ్గన్ ఆలౌటైన్లు ప్రకటించారు.రిటైర్డ్ హర్ట్ అంటే?ఇక రిటైర్డ్ హర్ట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయానికి గురైతే మైదానం వీడడం, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆడగలననుకుంటే మళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్ క్రికెట్లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.రిటైర్డ్ ఔట్ అంటే?మ్యాచ్‌లో ఒక ఆటగాడు గాయం లేదా అంపైర్ అనుమతి లేకుండా తనంతట తానుగా క్రీజు వీడడాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండదు. జట్టు స్కోరు పెంచాలనుకునే క్రమంలో హిట్టర్‌కు అవకాశం ఇచ్చేందుకు ఈ మధ్యన రిటైర్డ్ ఔట్‌ను ఆయా జట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.చదవండి: ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్! -
ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మూడో రోజుల్లోనే ముగిసింది. మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్గన్‌ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీమిండియా స్పిన్నర్లు మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను తిప్పేయడంతో అఫ్గానిస్తాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా భారీ విజయం సాధించినప్పటికీ ఆఫ్గన్ ఇన్నింగ్స్ ఆఖర్లో గందరగోళం నెలకొంది. ఆఫ్గన్ ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లో మొహమ్మద్ సలీమ్ సఫీ 9వ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత ఆఫ్గన్ ఆలౌటైనట్లు బిగ్స్క్రీన్పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు సహా మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. మరో వికెట్ ఉండగానే ఆలౌట్ ప్రకటించడం ఏంటని చర్చించుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ సమయంలోనే అష్రఫ్ కాలి గాయానికి గురవ్వడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో టీమిండియా జట్టులో సంబరాలు షురూ అయ్యాయి.మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (100), శుబ్‌మన్ గిల్ (126) శతకాలతో చెలరేగగా, సాయి సుదర్శన్ (81), పంత్ (81), సుందర్ (52) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలింది. రహమత్ షా (60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ 3 వికెట్లు తీశాడు. దీంతో ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్తాన్ 112 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: టీమిండియాకు షాక్.. ఆఫ్గన్‌పై గెలిచినా దండగే!


