ఆఫ్గన్‌తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు! | Rohit-Completes 16000 Runs As Opener-Shubman Gill 3000 Runs-ODIs | Sakshi
Sakshi News home page

ఆఫ్గన్‌తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!

Jun 13 2026 10:29 PM | Updated on Jun 13 2026 10:39 PM

Rohit-Completes 16000 Runs As Opener-Shubman Gill 3000 Runs-ODIs

ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్‌లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్‌ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్‌తో సమన్వయం లోపం వల్ల రనౌట్‌గా వెనుదిరిగాడు.  

మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్‌లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్‌, ఫఖర్ జమాన్‌లు 67 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement