పంత్‌కు షాక్‌.. కిషన్‌కు జాక్‌పాట్‌! | BCCI To Announce India Squad Vs Afghanistan in May 19, Kishans Comeback Fixed | Sakshi
Sakshi News home page

IND vs AFG: పంత్‌కు షాక్‌.. కిషన్‌కు జాక్‌పాట్‌!

May 14 2026 9:39 PM | Updated on May 14 2026 9:39 PM

BCCI To Announce India Squad Vs Afghanistan in May 19, Kishans Comeback Fixed

ఐపీఎల్‌-2026 ముగిసిన వెంటనే టీమిండియా జాతీయ విధుల్లో బీజీ కానుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్‌ల కోసం  అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సిరీస్‌లకు పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూ, కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు సైతం అఫ్గాన్‌తో టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. 

అయితే దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మరోవైపు న్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. 

రిజర్వ్ వికెట్ కీపర్‌గా పంత్ స్థానంలో ఇషాన్‌ను తీసుకునే అవకాశం ఉంది. పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా అఫ్గాన్‌తో వన్డేల్లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. 

అతడు అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నితీశ్ ప్రస్తుతం బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తున్నాడు. ఇక అఫ్గాన్‌-భారత్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాన్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: ముంబై ఇండియన్స్‌ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్‌ చరిత్రలోనే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement