ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నడిపిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సమయంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించాడు.
ఇప్పుడు సూర్యకుమార్ కూడా అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను బుమ్రాకు అప్పగించారు. తద్వారా ముంబై ఇండియన్స్ ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు ఇండియన్ కెప్టెన్ల సారథ్యంలో ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఒకే సీజన్‌లో ఏ జట్టుకు కూడా ముగ్గురు ఇండియన్స్ కెప్టెన్లగా వ్యవహరించలేదు. ఓవరాల్‌గా ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన ఐదో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
ఒకే సీజన్‌లో ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో ఆడిన జట్లు
ముంబై ఇండియన్స్ - 2008 (హర్భజన్, పొలాక్, టెండూల్కర్)
పుణే వారియర్స్ - 2013 (మాథ్యూస్, రాస్ టేలర్, ఫించ్)
ఎస్‌ఆర్‌హెచ్ - 2021 (వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే)
పంజాబ్ కింగ్స్ - 2024 (శిఖర్, సామ్ కరన్, జితేష్)
ముంబై ఇండియన్స్- 2026 (హార్దిక్, సూర్య, బుమ్రా)
చదవండి: IND vs SL: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్


