లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్.. అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. హిట్ మ్యాన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు.
రోహిత్ ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో 14,000 లిస్ట్-ఎ పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.
అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్(348 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. హిట్‌మ్యాన్ 345 ఇన్నింగ్స్‌లలో అందుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి(290) అగ్రస్ధానంలో ఉన్నాడు.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు:
సచిన్ టెండూల్కర్: 21,999 పరుగులు
విరాట్ కోహ్లీ: 16,447 పరుగులు
సౌరవ్ గంగూలీ: 15,622 పరుగులు
రాహుల్ ద్రావిడ్: 15,271 పరుగులు
రోహిత్ శర్మ: 14,007+ పరుగులు
అత్యంత వేగంగా 14,000 లిస్ట్-ఎ పరుగులు చేసిన భారత ప్లేయర్లు
విరాట్ కోహ్లి-290
రోహిత్ శర్మ-345
సచిన్ టెండూల్కర్- 348
చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. జైస్వాల్ అట్టర్ ఫ్లాప్


