సౌత్‌ జోన్‌ జట్టులో గోదావరి కుర్రాడు | Godavari Ranji Fast Bowler Sai Teja Selected for Duleep Trophy South Zone | Sakshi
Sakshi News home page

Duleep Trophy: సౌత్‌ జోన్‌ జట్టులో గోదావరి కుర్రాడు

Aug 5 2026 8:00 AM | Updated on Aug 5 2026 9:59 AM

Godavari Ranji Cricketer Sai Taja Selected To Duleep Trophy

నాగమల్లితోట జంక్షన్‌: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఆంధ్ర రంజీ క్రికెటర్‌ కావూరి సాయి తేజ ప్రతిష్టాత్మక ‘దులీప్‌ ట్రోఫీ’కి ఎంపికయ్యారు. సౌత్‌ జోన్‌ జట్టులో సాయితేజ చోటు దక్కించుకున్నాడు. ఫాస్ట్‌ బౌలర్‌ నిలకడగా రాణిస్తుండడంతో అతడికి ఈ అవకాశం దక్కింది.

సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఆటగాడు దులీప్‌ ట్రోఫీకి ఎంపిక కావడం ఉభయ గోదావరి జిల్లాల క్రికెట్‌కు గర్వకారణమని క్రీడాభిమానులు అంటున్నారు. పిఠాపురానికి చెందిన కె.నాగ గంగాధర్‌ దిలీప్‌ ట్రోఫీ మేనేజర్‌గా నియమితులయ్యారు.

ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తలాటం హరీష్‌ మాట్లాడుతూ సాయి తేజ దిలీప్‌ ట్రోఫీకి ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement