మానవ్‌ మాయ.. 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌ | Manav Suthars six-fer bundle Afghanistan for 152 | Sakshi
Sakshi News home page

IND vs AFG: మానవ్‌ మాయ.. 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌

Jun 8 2026 11:11 AM | Updated on Jun 8 2026 11:42 AM

Manav Suthars six-fer bundle Afghanistan for 152

ముల్లాన్‌పూర్‌ వేదికగా అఫ్గానిస్తాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత బౌలర్లు సత్తాచాటారు. అఫ్గాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. 113/5 ఓవర్‌ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు అదనంగా 39 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.

దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు సాధించిన సుతార్‌.. ఇప్పుడు మూడో రోజు ఆటలో మరో 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

తద్వారా ఈ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్‌ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్‌  మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్‌ సాధించాడు. ఇక మానవ్‌తో పాటు ప్రసిద్ద్‌ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఫాల్‌ ఆన్‌ ఆడనున్న అఫ్గాన్‌
ఇక స్వల్ప స్కోర్‌కే పరిమితమైన అఫ్గానిస్తాన్‌ను ఫాల్‌ఆన్‌కు భారత్‌ అహ్హనించింది.  412 పరుగుల లోటుతో అఫ్గాన్‌ తమ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండిచా 564 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కేఎల్‌ రాహుల్‌(100), శుబ్‌మన్‌ గిల్‌(126) సెంచరీలతో కదం తొక్కగా.. సుదర్శన్‌(81), పంత్‌(81) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! కేవ‌లం 10 బంతుల్లోనే

 

 

Advertisement
 
Advertisement
Advertisement